హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భర్తీచేస్తున్న 80 వేల పైచిలుకు ఉద్యోగాల రిక్రూట్మెంట్కు బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు బీసీ మంత్రిత్వశాఖ అన్ అకాడమీ సంస్థతో ఆ శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నది. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో బీసీ స్టడీ సర్కిళ్లు, కోచింగ్ సెంటర్ల ద్వారా దాదాపు 1.25 లక్షల అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నది.
దీంట్లో భాగంగా బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్యభవన్లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అన్ అకాడమీ సంస్థ ప్రతినిధులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4 తో పాటు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీచేసే ఉద్యోగాలకు తమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. శిక్షణ వివరాలు ఇలా..