హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గణపతి నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తూ సీఎస్ కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సెలవుకు బదులుగా అక్టోబర్ 11 (రెండో శనివారం) పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో నగర విద్యార్థులకు 5న మిలాద్-ఉన్ -నబీ (శుక్రవారం), 6న గణేశ్ నిమజ్జనం (శనివారం), 7న ఆదివారం ఇలా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
6, 7న ‘మద్యం’ బంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వర కు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.