హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ స హా పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, నిమజ్జనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరారు.