ప్రభుత్వం మక్కలను కొనాల్సిందే
రైతులు పండించిన మక్కలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్
- హైవేపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన
రేగొండ, మే 3 : రైతులు పండించిన మక్కలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి రేగొండలోని పరకాల- భూపాలపల్లి ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజలు తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తే, వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని విమర్శించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

