ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 09:11:10

నేడు ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం..

నేడు ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం..

హైదరాబాద్‌ : ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇవాళ జరుగనుంది. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న స్వామి వారు నిజ్జనానికి తరలనున్నారు. శోభాయాత్ర ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3గంటలకు పూర్తి కానుందని ఉత్సవ సమితి నాయకులు తెలిపారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెం.4 దగ్గర నిమజ్జనం కానుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణెష్‌ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితీ నాయకులు పేర్కొన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం కూడా నిర్వహించడం లేదని ఇప్పటికే నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే మంగళవారం భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభ ప్రారంభమైంది.

ఇప్పటికే వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కాగా.. చివరి రోజు మంగళవారం జరిగే విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు నడుమ నిమజ్జనం జరుగునుంది. కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్‌ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్నచిన్న గణనాథుల నిమజ్జనం కోసం వేల సంఖ్యలో ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు ప్రజలు తరలివస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రైవేటు బస్సులకు అనుమతి నిరాకరించారు. పలు చోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు నిమజ్జన యాత్ర గుండా వెళ్లొదని, ప్రత్నామ్నాయదారుల గుండా వెళ్లాలని పోలీసులు సూచించారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ రద్దీపై సూచనలు చేయనున్నారు. 


logo