సంగారెడ్డి : జహీరాబాద్(Zaeerabad) బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్(Gali Anil Kumar) పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భగాంగా తన ఓటు( Vote) హక్కును వినియోగించుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించారు.