గజ్వేల్, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు రోజురోజుకు మద్దతు వెల్లువెత్తుతున్నది. అన్ని సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. వివిధ కుల, వ్యాపార సంఘాలు, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతిన బూనుతున్నారు. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీ, వివిధ గ్రామాలకు చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్లు శనివారం సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డికి అందజేశారు.
ప్రజ్ఞాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గజ్వేల్ పట్టణంలోని పలువురు ఆర్అండ్ఆర్ కాలనీవాసులు కేసీఆర్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వంటే రు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్‌ను చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడేం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు జాఫర్‌ఖాన్, గుంటుక రాజు తదితరులు పాల్గొన్నారు.