సిద్ధిపేట : గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.గజ్వేల్ గౌరవాన్ని, ప్రతిష్టను కేసీఆర్ పెంచారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. మంగళవారం గజ్వేల్ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ గెలిచిచాక గజ్వేల్‌కు దవాఖాన వచ్చింది. మొన్నటి దాకా గజ్వేల్‌కు గూడ్స్ రైలు వచ్చిందని, ఈ రోజు నుంచి ప్యాసింజర్ రైలు ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి కోట్లు వెచ్చించి సిద్ధిపేట జిల్లాకు రైలు తెచ్చుకున్నామని పేర్కొన్నారు.
గజ్వేల్‌లో ఎక్కువ మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపిస్తే కామారెడ్డి నుంచి వద్దు గజ్వేల్ లోనే ఉండాలని కేసీఆర్ సారును ఒప్పించే పూచీ నాదని హామీనిచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని, లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతులు వివిధ వైశ్య సంఘ ప్రతినిధులు మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.
సీఎం కేసీఆర్‌కు మద్దతుగా చేసిన ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతి