హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగే ఆలోచనతో ఉన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మనసు ఇక్కడే.. త్వరలో కేసీఆర్‌ను కలుస్తా’ అని స్పష్టంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన బండ్ల.. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను కలిసిన బండ్ల.. తాను తిరిగి పార్టీలోకి వస్తానని అన్నట్టు తెలిసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ‘మళ్లీ మనింటికి రా’ అంటూ పలకడం విశేషం. ఆ తరువాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కేటీఆర్‌ను కలిశారు. ఆ తరువాత ఎమ్మెల్యే తెల్లం తాను పార్టీ మారడం లేదని చెప్పారు.
ఆ ఇద్దరిది హాట్‌టాపిక్
ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి,తెల్లం వెంకట్రావ్ కేటీఆర్‌ను కలవడం అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారింది.కాంగ్రెస్ సీనియర్లు, మంత్రు లు పట్టించుకోకపోవడం, హామీలు నెరవేర్చకపోవడం, కనీస గౌరవం ఇవ్వకపోవడంతో పార్టీమారిన ఎమ్మెల్యేలు మన సు మార్చుకున్నారని ప్రచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను కలిశారని సమాచారం తెలిసి మంత్రులు ఎమ్మెల్యేలతో మంతనాలు చేయగా, వెంకట్రావ్ యూ టర్న్ తీసుకున్నట్టు ప్రచారం.