Manne Krishanak | హెచ్‌సీయూ భూముల వివాదంపై పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ సాయంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
కాగా, హెచ్‌సీయూ భూములపై ఏఐ వీడియోలు, ఫొటోలు పెట్టారని కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్, థామస్ ఆగస్టీన్పై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, సినీ నటులు రవీనా టాండన్, జాన్ అబ్రహం, దియా మీర్జా సహా మరికొదరు ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు సమాచారం.
కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ ఫొటోలను తయారుచేసి సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్‌మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా గచ్చిబౌలి పోలీసులు నిందితులుగా చేర్చారని సమాచారం. వీరితో పాటు హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.