హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో మరికొన్ని మా ర్పులకు శ్రీకారం చుడుతామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. మండలి డైరీని ఆవిష్కరించారు. మేధోపరమైన పరిశోధనలకు సిలబస్లో చోటు కల్పిస్తామని చెప్పారు.
సమస్య పరిష్కార పద్ధతులు, అనుభవపూర్వక అభ్యాసం వంటి వాటిని అంతర్భాగం చేస్తామని తెలిపారు. వైస్చైర్మన్లు ఎస్కే మహమూద్, ప్రొఫెసర్లు ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.