హైదరాబాద్ : సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ( Funds ) మంజూరవుతు న్నాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ( Assembly ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే నియోజకవర్గాలకు నిధులు రావడం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు ప్రియారిటి ఇవ్వాలని, ప్రియారిటి బేస్‌గా వెంటనే పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శ్రద్ధ తీసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తారని కోరుతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఎన్ని నిధులు వచ్చినా అక్కడికి వెళ్తున్నాయనేది బయట జరుగుతున్న ప్రచారమని, అందరినీ సమానంగా వివక్ష చూపకుండా అందరిని సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్ని నియోజకవర్గాల మీద శ్రద్ధచూపి అభివృద్ధికి నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని, బడ్జెట్లో విద్యకు అత్యంత తక్కువ కేటాయించారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో నాణ్యమైన ఆహారం విషయంలో మానిటరింగ్ ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.