హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సం యుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్రోకోతోపాటు ప్రతి కార్యక్రమానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఆదివారం విద్యానగర్‌లోని ఆర్ కృష్ణయ్య నివాసంలో ఆయనతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చేపడుతున్న రైల్‌రోకోకు మద్దతివ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అనేక ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను కృష్ణయ్య నడిపించినట్టు కొనియాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కు పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితకు బీసీలంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా అన్యాయం జరుగుతున్న బీసీ ల కోసం కవిత పోరాటం అభినందనీయమ ని పేరొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ అచారి, నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు.