హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఎన్నారై బీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మనమంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంటున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ మాట్లాడుతూ.. ఎన్నారై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న సంతోష్‌కు ఎన్నారైల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాఘవ, ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, టాక్ మాజీ అధ్యక్షురాలు పవిత్రారెడ్డి, ఇగ్నైటెడ్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్‌రెడ్డి, సికా చంద్రశేఖర్‌గౌడ్, టాక్ సీనియర్ నాయకులు హరిగౌడ్, రవి రేతినేని, రవి పులుసు, సత్య చిలుముల, రమేశ్ ఎసెంపల్లి, గణేశ్ కుప్పాల, అబూజర్, సురేశ్ బుడగం, శ్రీకాంత్ జెల్లా, మట్టారెడ్డి, సత్యపాల్‌రెడ్డి, సురేశ్ గోపతి, ప్రశాంత్ మామిడాల, క్రాంతి, స్వాతి, జాహ్నవి, దివ్య, తరుణ్, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు.