మడికొండ : గ్రేటర్ 46వ డివిజన్ రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు విద్యార్థులకు నోట్ బుక్స్, న్యూ సైన్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్న భాగ్యలక్ష్మి స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. ఈ కార్యక్రమానికి కాజీపేట ఎంఈఓ మనోజ్ కుమార్ హాజరై మాట్లాడారు.
పేద విద్యార్థులకు సహకారం అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు తక్కళ్లపల్లి రాంగోపాల్ రావు, మనుపాటి సమ్మయ్య, 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, మడికొండ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సంధ్యారాణి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ స్రవంతి, ప్రధానోపాధ్యాయులు రాంచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు లీలరాణి, శంశుద్దిన్, లక్ష్మి, బ్రహ్మచారి, అరుణ, స్వర్ణలత, సీఆర్పి రేణుక పాల్గొన్నారు.