హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు ఉచిత డాటా ఇంజినీరింగ్ కోర్సు అం దించనున్నట్టు ‘శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. శ్రీ సత్యసాయి సేవా సం స్థల ఆధ్వర్యంలో మూడో బ్యాచ్‌కు ఉచితంగా ఈ కోర్సు ప్రారంభిస్తున్న ట్టు పేర్కొన్నది. 2022-25లో ఎం ఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సు లు పూర్తి చేసిన వారు 90 రోజుల కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఏ ప్రాంతం వారు అయినా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ వివరాలకు www.sethu.ai లేదా 90523 72023 నెంబర్లో సంప్రదించాలని కోరింది. బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ పై థాన్, ఎస్‌క్యూఎల్, పవర్ బీఐ, ఏఐ ఫండమెటల్స్తోపాటు సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ కౌన్సెలింగ్‌లో సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించింది. కోర్సు పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లో సహకారం అందిస్తామని తెలిపింది. హైదరాబాద్‌లోని శ్రీ సత్య సాయి స్కిల్ సెంటర్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో క్లాసులు నిర్వహిస్తామని స్పష్టంచేసింది.