హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఐదుగురు సభ్యులతో కూడిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ)ని నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం.. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదానికి పంపించారు. సీఎం నుంచి ఈ ఫైల్ నేరుగా మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి వెళ్తుంది. ఈ సబ్‌కమిటీ సిఫారసుల ఆధారంగా బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అధిక ఫీజు లు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకొంటారు. ఫీజులను నోటీసుబోర్డుపై ప్రదర్శించడంతో పాటు వెబ్సైట్లోను పొందుపరచాలన్న నిబంధనలను పొందుపరచనున్నట్టుగా తెలిసింది.