KTR | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : పెట్టుబడుల పేరిట ప్రజలను మోసం చేసేందుకు షెల్ కంపెనీలతో స్కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన పోస్టుపై కేటీఆర్ స్పందిస్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో దావోస్లో జరిగిన కార్యక్రమంలో గోడి సంస్థ, తాజాగా స్వచ్ఛ బయో పేరుతో నెల క్రితమే రేవంత్రెడ్డి సోదరుడి కంపెనీ తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటివి చాలా చేస్తున్నారని, ఇవి ప్రారంభం మాత్రమేనని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఇలాంటి వాటిని అద్భుతంగా వెలికితీశాడని కేటీఆర్ ప్రశంసించారు.