నయవంచనకు నాలుగేండ్లు!.. 2022లో వరంగల్ వేదికగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్’
సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్' పేరుతో హామీలను ప్రకటించారు.
- అడ్డగోలు హామీలు ప్రకటించిన రాహుల్, రేవంత్‌రెడ్డి
- రెండున్నరేండ్లుగా అమలు చేయకుండా ప్రభుత్వం దగా
- కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్
- నేడు పదివేల మందితో వరంగల్‌లో ‘రైతు సంగ్రామ సదస్సు’
- హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్’ పేరుతో హామీలను ప్రకటించారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏదో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా వాటిల్లో కనీసం నాలుగైదు హామీలు కూడా నెరవేర్చని దుస్థితి. పైగా ఒకప్పుడు పండుగగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అష్టకష్టాలకు నిలయంగా మార్చింది. దుక్కి దున్నింది మొదలు పంట అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ నరకం చూపిస్తున్నది. అందుకే తెలంగాణ రైతాంగం ప్రభుత్వంపై తిరగబడుతున్నది.
రైతులను మభ్యపెట్టి..
నాలుగేండ్ల కిందట మొత్తం 34 హామీలతో వరంగల్ వేదికగా రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్‌ను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని, ఏకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ కూలీలకు కూడా రైతుభరోసా కింద ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరను పెంచి కొనుగోలు చేస్తామని, వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని.. ఇలా అనేక హామీలు గుప్పించారు.
ఈ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఊరూరా ప్రచారం చేసింది. రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. రెండున్నరేండ్లుగా రైతు డిక్లరేషన్‌కు పాతరేసింది. 34 హామీల్లో కనీసం నాలుగు కూడా పూర్థిస్థాయిలో అమలు చేయలేదని రైతులే మండిపడుతున్నారు. రైతు భరోసా పేరుతో చేస్తున్న డ్రామాలే కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు దాపురిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే వేదిక ద్వారా నిలదీయనున్న బీఆర్ఎస్
రైతు డిక్లరేషన్ విడుదల చేసిన వరంగల్ వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతు సంగ్రామ సదస్సు పేరుతో బుధవారం భారీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులను ఆయన క్షేత్రస్థాయిలో కలుసుకున్నారు. వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును ప్రకటించగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రైతు మేళా నిర్వహిస్తున్నది.
రైతు డిక్లరేషన్‌లో ప్రధాన హామీలివే
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ
- ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులతోపాటు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు.
- అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
- మూతబడిన చకెర కర్మాగారాలు తెరిపించడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు.
- వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తాం.
- వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం
- రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు.
- రైతులకు భూమి యాజమాన్య హకులను కల్పించి వాటికి అవసరమైన రక్షణ కల్పించడం.
- నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉకుపాదం. అక్రమ విక్రయాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కేసులతో కఠినచర్యలు, వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం.
- ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి.
- రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు
- లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా, తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం-పంటల ప్రణాళిక.
- రైతులకు 3 లక్షల దాకా వడ్డీలేని పంట రుణాలు.
- రాయపూర్ ఏఐసీసీ రైతుల తీర్మానాలను అమలు చేస్తాం
- వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం. ముంపునకు గురైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కరకట్టలు నిర్మిస్తాం.
- యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా అమలు చేస్తాం
- ‘ఆదర్శ రైతు’ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. ప్రతి మండలానికీ ఒక మారెట్ యార్డును ఏర్పాటు చేస్తాం.
- వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చేస్తాం
- ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ సబ్సిడీలను (విత్తన సబ్సిడీ, ట్రాక్టర్లతోపాటు వ్యవసాయ యంత్రాలపై సబ్సీడీ, ఎరువుల సబ్సిడీ, పురుగు మందుల సబ్సిడీ మొదలయినవి) రైతులకు అందజేస్తాం
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందజేస్తాం
- మక్కజొన్న పంటకు పూర్వ వైభవం తెస్తాం
- వరిధాన్యం కొనుగోలులో తేమ శాతం నెపంతో తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తాం
- పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ.5 ప్రోత్సాహకాన్ని ఇస్తాం.
- కోతుల నివారణకు ప్రతి జిల్లాలో స్టెరిలైజ్ ( సంతాన నిరోధక) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.
- రైతులకు వివిధ పంటలకు చెల్లిస్తామన్న మద్దతు ధర (రూ.ల్లో)

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

