పెద్దపల్లి : రామగుండంలోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణి రామగుండం అర్జీ -3 అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో పై కప్పు కూలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు.
అసిస్టెంట్ మేనేజర్ తేజతో సహా మరో ముగ్గురు కార్మికులు జాది వెంకటేశ్వర్లు(ఆపరేటర్) రవీందర్ (బదిలీ వర్కర్) పిల్లి నరేష్ (ఎంఎస్) మీస వీరయ్య (సపోర్ట్ మెన్) మృతి చెందారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.