కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు దవాఖానలో వైద్య సేవలు దైన్యంగా మారాయి. మండల కేంద్రంలోని వైద్యశాలలో గురువారం ఒకే బెడ్‌పై నలుగురు, ఐదుగురికి చికిత్సలు అందించారు. వసతులు కల్పించి సర్కారు వైద్యంపై భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ ఏరియా దవాఖానలో సేవలు మెరుగు పరచాలని సూపరింటెండెంట్‌కు ఓ రోగి బంధువు రాసిన వాట్సాప్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ విషయమై సూపరింటెండెంట్ నారాయణరెడ్డిని సంప్రదించగా, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రోగులకు ఇబ్బంది కలిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.