తుంగభద్ర తీరం.. కన్నీటి సంద్రం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది.
- బాలుడిని రక్షించబోయి ప్రవాహంలో నలుగురు గల్లంతు
- నదిలో గాలింపు.. మరో నాలుగు మృతదేహాలు వెలికితీత
- ఎమ్మిగనూర్ దవాఖానలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
- భౌతికకాయాలు కుటుంబసభ్యులకు అప్పగింత
అయిజ, మే 31 : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది. ఐదేళ్ల బాలుడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో మరో నలుగురు కొట్టుకుపోగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం ధనుశ్ మృతదేహం లభ్యంకాగా, ఆదివారం ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి సతీశ్ (35), యవన్చంద్ర (5), సంధ్య (22), రాఘవేంద్ర (25) భౌతికకాయాలను వెలికితీశారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరి పర్యవేక్షించారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ దవాఖానకు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు భౌతికకాయాలను అప్పగించారు. సతీశ్, యవన్చంద్ర తండ్రీకొడుకులుకాగా.. కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రితోపాటు మరో ముగ్గురు నీటి ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

