ములుగురూరల్/కాటారం/కేసముద్రం/నెక్కొండ, మే 2 : వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు. ఉదయం విధుల అనంతరం సాంబయ్య స్టోర్ రూమ్‌లో నిద్రించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన సిబ్బంది దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మం డలం చింతకానికి చెందిన తిరునగరి కేశవ్ (40) పౌరోహిత్యం చేస్తుంటాడు. సొంత పనిపై కాటారం వెళ్లి తిరిగి వచ్చాక అస్వస్థతకు గురై నిద్రలోనే మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెం దిన సోమయ్య (72) పది రోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తూ మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యా డు. మహబూబాబాద్‌లోని దవాఖానలో చేర్చ గా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన సౌరపు సారమ్మ (55) ఎండలకు అస్వస్థతకు గురైంది. దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.