హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల కోటా నుంచి గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌తో హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతి జారీ చేసిన నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ గోవర్దన్‌రెడ్డి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయమూర్తులు, వారి బంధువులు, సన్నిహితులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అదనపు అడ్వకేట్ జనరల్స్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.