హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా చెల్గల, వనపర్తి జిల్లా నాగవరం శివారులో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.