Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
కాగా, మృతులను కుబీర్ మండలం కుప్తి గ్రామానికి చెందిన పటేల్ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.