మంజీరాలో నలుగురు జలసమాధి

- పీర్ల దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
- కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో విషాధం
బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో శనివారం చోటుచేసు కొంది. మండలంలోని శెట్లూరుకు చెందిన కదిరిగ గంగారాం భార్య అంజవ్వ (48), కూతురు సోని (17), గంగారాం తమ్ముడు మారుతి కూతురు గంగోత్రి (11), కొడుకు ప్రశాంత్(7) బీర్కూర్ శివారులోని మంజీ రా నది సమీపంలో ఉన్న గైపీర్ల వద్ద పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బయల్దేరారు. నది దాటుతున్న క్రమంలో అందులోని ఇసుక కయ్యలో పడిపోయారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారి కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మళ్లీ గాలించగా నదిలో మృతదేహాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన నలుగురు ఒకేరోజు చనిపోవడంతో శెట్లూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి
శెట్లూరుకు చెందిన నలుగురి మృతి విషయం తెలుసుకొన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

