Weather Update | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సోమవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని.. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 6న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు వీచే అవకాశాలున్నాయని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read Also : Bhadrachalam | భద్రాచలంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటల సమయం