భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామచంద్ర స్వామి మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది. లక్షణ సమేత సీతారాముని ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది.
ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆయలంలో భక్తులు రద్ద నెలకొన్నది. ఆదివారం ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావచ్చారు. దీంతో క్యూలైన్లలో పూర్తిగా నిండిపోయాయి. నారసింహుని దర్శనానికి 2 గంటలకుపైగా సమయం పడుతున్నది.