నార్నూర్, అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖాడోడిలో పశువులపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో నాలుగు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు గేడం తులసీరాం వివరాల ప్రకారం.. రోజూ మాదిరిగానే శనివారం వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లతో పొలానికి వెళ్లాడు. ఎడ్లు మేత మేస్తున్న సమయంలో ఒక్కసారిగా పులి దాడి చేసింది. దీంతో నాలుగు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని.. ప్రభుత్వం, అటవీ అధికారులు ఆదుకోవాలని బాధితుడు కోరాడు.