హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మొదటి విడతలో మంజూరైన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది.
ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 82లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే. కాగా, మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో 4.5లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఇప్పటివరకు కేవలం 72,045 ఇండ్లు మంజూరు చేయడం గమనార్హం.