హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): అటవీ భూముల రైతుల కు పట్టాలివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయా న్ని రద్దు చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనర్హులు రిజ ర్వు ఫారెస్ట్‌ను ఆక్రమించుకున్నారని, 11.5 లక్షల ఎకరాలకు ప్రభుత్వం ప ట్టాలు ఇవ్వబోతున్నదని, ఈ మేరకు 2021 నవంబర్ 4న ప్రభుత్వం ఇచ్చి న మెమోను కొట్టివేయాలని ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి పిటిషన్లో కోరారు.
పోడు సాగును అంతం చే యాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయం కారణంగా మహారాష్ట్ర నుంచి బీసీలు కూడా మన అడవుల్లోకి వచ్చారని తెలిపారు. అటవీ ప్రాంతంలో 2.41 లక్షల ఎకరాలను వలసదారులు ఆక్రమించుకున్నారని తెలిపారు. మెమో ప్రకారం పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.