హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈడీ పెట్టింది అక్రమ కేసు అని, ఇది మనీ లాండరింగ్ పరిధిలోకి రాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ రేస్ విషయంలో ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని తెలిపారు. కేటీఆర్‌పై కక్షపూరితంగా మనీలాండరింగ్ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిసున్నట్టు చెప్పారు. ఈ కేసు పీఎంఎల్ఏ చట్టం పరిధిలోకి రాదని, కేటీఆర్‌పై మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసును బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా ఎదుర్కొంటుందని స్పష్టంచేశారు.