జనగామ, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కోర్టు అనుమతితో మంగళవారం జనగామ జిల్లా చిల్పూ రు మండలం పల్లగుట్టలో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన తల్లి పొట్లపల్లి సరోజనాదేవి (99) అనారోగ్యంతో సోమవారం కరీంనగర్లో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామం పల్లగుట్టకు తరలించారు.
తల్లికి చిన్న కుమారుడు తలకొరివి పెట్టాలన్న సంప్రదాయాన్ని గౌరవించి కడసారి చూపులకు అనుమతించాలని రాధాకిషన్‌రావు తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రెండురోజుల తాత్కాలిక బెయిల్ అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాధాకిషన్‌రావును పోలీసు ఎస్కార్ట్‌తో సోమవారం రాత్రి పల్లగుట్టకు తీసుకొచ్చారు. తల్లి అంత్యక్రియలకు సంబంధించి మినహా ఇతర అంశాల గురించి బంధుమిత్రులు సహా ఎవరితోనూ మాట్లాడకుండా పోలీసు ఎస్కార్ట్ సిబ్బంది కట్టడి చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తల్లి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సాయం త్రం 5 గంటలకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.