నాంపల్లి కోర్టులు, మే 10 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా సంస్థ యజమాని శ్రావణ్ అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
పంజాగుట్ట పోలీసుల విజ్ఞప్తి మేరకు నాంపల్లిలోని 12వ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య శుక్రవారం వారెంట్లు జారీచేశారు. క్యాన్స ర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లానని, కోలుకోగానే భారత్‌కు తిరిగివచ్చి విచారణకు సహకరిస్తానని ప్రభాకర్‌రావు ఓ మెమో ద్వారా కోర్టుకు తెలియజేసినప్పటికీ ఆయన అరెస్టుకు కోర్టు వారంట్ జారీ చేసింది.