హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవాప్తంగా మాజీ సర్పంచ్‌లను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. అడ్డంకులు, నిర్బంధాలు దాటుకొని సోమవారం అసెంబ్లీ ముట్టడికి వ చ్చిన పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అసెంబ్లీ ఎదుట అరెస్టుచేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జా యింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గూ డూరు లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచ్ల బాధలు వర్ణనాతీతమని పేర్కొన్నారు.
గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రెండేండ్లుగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్ర ధాన కార్యదర్శులు మోడెం విద్యాసాగర్, రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.