చిట్యాల, జూలై 22 : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన మాజీ సర్పంచ్ దంపతులు బుధవారం గ్రామపంచాయతీ భవనానికి తాళంవేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపూర్ తండా గ్రామపంచాయతీ భవనాన్ని రూ.20 లక్షలతో మూడేండ్ల క్రితం అప్పటి సర్పంచ్ బానోత్ జవహర్లాల్నాయక్ నిర్మించారు.
నిధులు మంజూరైనా ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత సర్పంచ్ తనకు అన్యాయం చేస్తున్నారని మాజీ సర్పంచ్ బానోత్ జవహర్లాల్ నాయక్ ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని వాపోయారు. అప్పులు చేసి జీపీ భవనాన్ని నిర్మిస్తే బిల్లు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.