హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన అంశంపై శుక్రవారం ఆయ న స్పందించారు. బీసీల హకులు, వారికుండే అవకాశాలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. నాడు రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొనిపోయి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పదహారు మంది ఎంపీలు వుండి కూడా, బీసీ రేజర్వేషన్లపై ఏనాడు పార్లమెంట్లో గొంతెత్తలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేశాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పా లనలో బీసీలకు గౌరవం, హకులు సమానంగా లభించాయని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్, అక్టోబర్ 10 : బీసీల మనోభావాలతో రాజకీయ డ్రామాలాడిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్రలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదని, దశాబ్దాలుగా ఆ వర్గాలను మోసం చేస్తూ వస్తున్నదని మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశం చట్టం కాకముందే జీవో తెచ్చాడంటేనే ఆయన చిత్తశుద్ధి అర్థమైందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లను నీరుగార్చాలనే జీవో తెచ్చి కోర్టులో కేసు వేయించాడని మండిపడ్డారు. బీసీల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగే రాష్ట్ర బంద్‌కు బీసీ జనసభ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీ సీ నేత వీజీఆర్ నారగోని, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు మేకల కృష్ట యాద వ్, రాంకోటి ముదిరాజ్ పాల్గొన్నారు.