రేవంత్ వ్యాఖ్యలు అర్థరహితం
బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
- సీఎం రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనంటూ ప్రజల్లో చర్చ
- బీఆర్ఎస్ పార్టీకి భయపడే గుమ్లాపూర్‌లో రేవంత్‌రెడ్డి సభ
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 6: బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో కాకుండా.. పక్కన ఉన్న గుమ్లాపూర్‌లో రేవంత్ సభ పెట్టారని చర్చ నడుస్తున్నదని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ రిపోర్టుపై ఇప్పటికే హరీశ్‌రావు, జోషి హైకోర్టును ఆశ్రయించగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దంటూ కోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. గంగుల మాట్లాడుతూ..
బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని తానే చేసినట్టు బండి సంజయ్ చెప్పుకొంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ప్రచురించిన కరపత్రాల్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. స్మార్ట్‌సిటీ సాధన, నిధుల మంజూరులో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

