హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చింది అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. బీఆర్టీయూ అధక్షుడు రాంబాబు యాదవ్‌తో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక చట్టాలను కుదించి 29 కు పరిమితం చేసి నాలుగు లేబర్ కోడ్స్‌ను తెచ్చిందని మండిపడ్డారు. కార్మిక వర్గాలు ఈ కొత్త లేబర్ కోడ్స్‌పై ఆందోళనగా ఉన్నాయన్నారు. చట్టాలు పాస్ చేసే ముందు కార్మికు వర్గాల అభిప్రాయాన్ని కేంద్రం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టాలకు నిబంధనలు రూపొందించే క్రమంలో ఇప్పుడు కేంద్రం అభిప్రాయం చెప్పమంటున్నది. బీఆర్ఎస్ పార్టీ తరపున లేబర్ కోడ్లపై అభిప్రాయాలు సేకరించి ఓ నిర్ణయం తీసుకునేందుకు రేపు తెలంగాణ భవన్లో ఉదయం పదకొండు గంటల నుంచి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికు సంఘాల నేతలు, వివిధ పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు, అసంఘటిత రంగ కార్మిక సంఘాల నేతలు, బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.