హైదరాబాద్, జనవరి 30 (నమస్తేతెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం క్షమించదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి 60 ఏండ్ల తెలంగాణ స్వప్నాన్ని సాధించిన మహానాయకుడిపై వ్యవహరించే తీరు సరైంది కాదని పేర్కొన్నారు. ఎర్రవల్లిలో ఉంటున్న కేసీఆర్‌ను విచారణ పేరుతో హైదరాబాద్‌కు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని సుభాశ్‌రెడ్డి తప్పుబట్టారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన సిట్.. తనను ఎకడ సంప్రదించాలో తన చిరునామా ఏమిటో కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయినా నందినగర్ మాత్రమే అధికారిక రికార్డులో ఉన్నదని సిట్ అధికారులు పేరొనడం విడ్డురంగా ఉన్నదని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ అధికారిక ఉత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లికి ప్రొటోకాల్ అధికారులు వెళ్లిన విషయం మరిచినట్టున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎకడ నివాసం ఉంటున్నారో స్పష్టంగా తెలిసినప్పటికీ సిట్ అధికారులకు తెలియలేదా? అని నేను ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారాలను యావత్తు తెలంగాణ సమాజం సరైన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.