హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ): ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రవాసీ తెలంగాణవాసులు అండగా నిలువాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. అమెరికాలోని ఓహీయోలో బీఆర్ఎస్ యూఎస్ఏ ఐడ్వెజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ ఆధ్వర్యంలో ‘బీఆర్ఎస్ యూఎస్ఏ సక్సెస్ మీట్’ను నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రసమయి, కర్నె ప్రభాకర్ హాజరయ్యారు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణవాసులు పురిటిగడ్డ అభివృద్ధికి పునరంకితం కావాలని కర్నె కోరారు. అంతకుముందు మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి నివాళుర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.