జగిత్యాల, ఏప్రిల్ 1 : ‘కాంగ్రెస్ పార్టీలో ఏముంది? నువ్వు అక్కడే ఉంటే నేనే ఆ పార్టీ (బీఎస్పీ)లోకి వద్దామనుకున్నా’ అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఓ కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో జీవన్‌రెడ్డి కేక్‌కట్ చేసి అక్కడున్న వారికి తినిపించారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన విజయ్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో ఏముంది? నాలాంటి వారికి ఇక్కడ ఏమీ లేదు, నువ్వు అక్కడే ఉంటే నేనే ఆ పార్టీలోకి రావాలని అనుకున్నా’ అని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి కొద్దిరోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారు.