గంగాధర, జూలై 12: కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పెండలోనిపల్లిలో పారిశుధ్య నిర్వహణ లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు తెలుపడంతో శనివారం గ్రామాన్ని సందర్శించారు.
బీఆర్ఎస్ నాయకులతో కలిసి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను శ్రమదానంతో తొలగించి ట్రాక్టర్లో డంప్యార్డుకు తరలించారు. అనంతరం బూరుగుపల్లిలో మీడియాతో మాట్లాడారు. చెత్తసేకరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య పనులకుగాను ట్రాక్టర్లను కొనుగోలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ ట్రాక్టర్లను మూలన పెట్టారని తెలిపారు.