కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 16: కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కక్షపూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ భయపడరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేస్‌లో అవినీతి జరగనప్పుడు కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలుచేయకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గురువారం కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను జైలుకు పంపించాలన్న కుట్రతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను ఏ పార్టీలో ఉన్నావని అడిగినందుకే కేసు లు పెడుతారా? అని ప్రశ్నించారు.