మెదక్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : మెదక్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తీరని అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మెదక్‌కు వైద్య కళాశాల మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
వైద్య కళాశాల కోసం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య కళాశాలను 100 సీట్ల నుంచి 50 సీట్లకు కుదించిందని ఆమె మండిపడ్డారు.