నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన తనకు లేదని, కొందరు మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ తనకు దైవ సమానులని, ఆయనకు చెప్పకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్‌లో మాట్లాడారు.
అన్ని పార్టీల వారు మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగిన మాట వాస్తవమని తెలిపారు. కానీ తాను పార్టీ మారుతున్నట్టు ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.