నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 12 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు.
నియోజకవర్గం నుంచి 3 వేలకుపైగా అభిమానులను తరలించాలన్న ఉద్దేశంతో 25 బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకుముందు చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించారు.