నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1: హైడ్రా.. ఒక పెద్ద డ్రామా అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన అంటే బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చడమేనా అని ప్రశ్నించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడారు. ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపడమేమిటని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ తీరుతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓటువేసి తప్పుచేశామని మధనపడుతున్నారని అన్నారు. 15 వేలకోట్లు సంపాదించాలనే కూలదోసుడుకు పూనుకున్నారని ఆరోపించారు.