BRS Party | సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కిండ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు సైతం బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్లో చేరారు.